ప్రేమికుల రోజున జోక్ అనుకుంటే.. జాక్ పాట్ తగిలింది - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికుల రోజున జోక్ అనుకుంటే.. జాక్ పాట్ తగిలింది

February 19, 2018

ప్రేమికుల దినోత్సవం.. అదేనండి ఫిబ్రవరి 14  ఓ జంట కాపురంలో లక్షల కరెన్సీని వర్షించింది. భార్యపై ప్రేమతో ఓ భర్త కొనిపెట్టిన లాటరీ టికెట్‌కు జాక్ పాట్ తగిలింది. లక్ష డాలర్లు(రూ. 64 లక్షలు) ఇంట్లోకి వచ్చి వాలాయి.అమెరికాలోని అయోవాకు చెందిన సింథియా హోల్మ్స్‌కు భర్త డాన్ హోల్మ్స్.. 10 డాలర్లు పెట్టి కాసినో రిచెస్ అనే లాటరీ టికెట్ కొన్నాడు. దాన్ని ఆమెకు బహుమతిగా అందించాడు. దానికి ఆమె మూతి మూడువంకర్లు తిపపి.. ‘సర్లే.. పెద్ద విలువైన కానుకే తెచ్చావ్..’ అని ఎద్దేవా చేసి జోకులేసింది. అయితే ఆ జోకులే నిజమయ్యాయి. డాన్ కొన్ని టికెట్‌కు లక్ష డాలర్లు( రూ. 64 లక్షలు) వచ్చాయి. దీంతో సింథియా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇంకో ముచ్చటేమంటే.. ఈ జంట తమ టికెట్‌కు వంద డాలర్లు వస్తాయని అనుకున్నారట. కానీ లక్ష తగడలడంతో సింథియాకు నోట మాటరాకుండా పోయింది. నిజమా? కలా? అనే అనుమానంతో నేరుగా లాటరీ ఆఫీసుకే వెళ్లింది. అక్కడివారు నిజమేనమ్మా అని చెప్పారు. అయితే  డాన్ మాత్రం ఆశ్చర్యపోలేదట. ‘అంతా ఆ వాలెంటైన్ మహర్షి దయ. నేను సింథియా కోసం కొన్న టికెట్‌కే  లాటరీ తగులుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాను..’ అని డాన్ చెప్పాడు. వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న సింథియా ఈ డబ్బుతో కారు, ఇల్లు కొనుక్కుంటానని చెబుతోంది.