ఈ ముసలి బందిపోటుదొంగను గుర్తుపట్టారా? - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ముసలి బందిపోటుదొంగను గుర్తుపట్టారా?

March 14, 2018

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీకైయ్యాయి. ఈ చిత్రంలో హీరోగా అమీర్ ఖాన్ నటిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతడు వయోధిక బందిపోటు(థగ్గు) పాత్ర మేకప్‌తో ఫోటోలు సోషల్ మీడియాలో లీకైయ్యాయి.

అమితాబ్‌తో ఏ మాత్రం పోలిక లేకుండా ఉండడంతో ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి ప్రకటనీ చేయలేదు. అభిమానులు మాత్రం అమితాబ్ లుక్ ఇదేనని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో అమీర్ లుక్ బయటకు రావడం ఆ ఫోటో కూడా అభిమానులను తెగ ఆకట్టుకోవడం తెలిసిందే. అమీర్, అమితాబ్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ జోధ్‌పూర్‌లో జరుగుతుండగా, అమితాబ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.