అమితాబ్ ఆస్తులు 800 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్ ఆస్తులు 800 కోట్లు

March 12, 2018

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పేరిట ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు వున్నట్టుగా, ఆయన సతీమణి జయాబచ్చన్ రాజ్యసభ సభ్యురాలిగా ఆమె దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే తన పేరుతో రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు జయాబచ్చన్ పేర్కొనడం విశేషం.ఒక దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదర్కున్నారు అమితాబ్. పడి లేచిన కెరటంలా అమితాబ్ ఆర్థిక ఒడిదొడకులు చవిచూశారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఆయన చేసిన వ్యాపారాల్లో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. ఆ దశలో అమితాబ్ ఆర్థికంగా బాగా నష్టపోయారు. ఆ తర్వాత ఆయన నటనను కొనసాగించారు. వరుస అవకాశాలతో ఈ వయసులో కూడా బిజీగా మారిపోయారు.  అటు సినిమాలు, ఇటు ప్రైవేట్ యాడ్స్ చేస్తూ చేతినిండా సంపాదించారు. పునర్వైభవాన్ని రెట్టింపు చేశారు.

అలాగే వివిధ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు కూడా పెట్టారు. దీంతో.. రాబడి పెరిగింది. ఆర్థిక కష్టాల నుంచి బయట పడ్డారు. పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలనుకున్నారు.  ఈ క్రమంలో ఏ సీనియర్ నటుడు లేనంత బిజీగా మారి తన స్థానాన్ని ఇప్పటికీ పదిలంగానే వుంచుకున్నారు అమితాబ్.