అమితాబ్‌కు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్‌కు నోటీసులు

October 26, 2017

అక్రమ నిర్మణం జరిపారని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు.  ముంబయిలోని గోరేగామ్ ఈస్ట్‌లో ఫిలింసిటీకి సమీపంలో నిర్మించిన బంగళాను అనుమతులకు విరుద్ధంగా అడ్డగోలుగా నిర్మించారని నోటీసులు అందించారు.

ఈ మధ్య ముంబయి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్పోరేషన్ అక్రమ కట్టడాల తనిఖీలు మొదలు పెట్టారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చాల‌ని లేక‌పోతే కొత్త‌గా ప్లాన్ త‌యారు చేసి త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని వారికి ఆదేశించిన‌ట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ఇటీవల మరో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చెందిన భవంతిలో ఒక అంతస్తును అక్రమంగా నిర్మించారంటూ అధికారులు కూలగొట్టడం తెలిసిందే.