భర్త దారితప్పాడని.. కోసి టాయిలెట్‌‌లో పడేసింది - MicTv.in - Telugu News
mictv telugu

భర్త దారితప్పాడని.. కోసి టాయిలెట్‌‌లో పడేసింది

February 21, 2018

అడ్డదారి పట్టిన భర్తను దారిలోకి తెచ్చుకోవాలని ఓ ఇల్లాలు తప్పుదారి పట్టింది. భర్తకు బుద్ధి వస్తుందనుకున్న ఆ ఇల్లాలి ఆలోచన తలకిందులైంది.  నిద్రిస్తున్న భర్త మార్మాంగాన్ని కోసి, టాయిలెట్ బేసిన్‌లో పారేసింది. ఆమె చేసిన పనికి ఇప్పుడు భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. పంజాబ్‌లోని జలంధర్‌ పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు కథనం ప్రకారం..ఆజాద్ సింగ్, సుఖ్వంత్ కౌర్ ఇద్దరు భార్యాభర్తలు.  జోగీందర్ నగర్‌లో  నివాసం వుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు వున్నారు. ఆలుమగలెప్పుడూ గొడవలు పడేవారు. ‘నువ్వు వేరే ఆమెవద్దకు వెళ్తున్నావు. నాపై మోజు తీరిపోయింది. అలాంటి వాడివి పెళ్లెందుకు చేసుకున్నావ్? పెళ్లి చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరగాల్సింది..’ అని గొడవ పెట్టుకునేది. అయితే ఆమె ఎంతమొత్తుకున్నా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భర్త అక్రమ సంబంధానికి చరమగీతం పాడాలనుకొని ఓ పథకం రచించుకుంది ఆ ఇల్లాలు.

రాత్రి గాఢంగా నిద్రపోతున్న  భర్త తల మీద  రాడ్డుతో బలంగా కొట్టింది. అతడు స్పృహ కోల్పోగానే అతని మార్మాంగాలు కోసి, టాయిలెట్ బేసిన్‌లో పారేసి నీళ్ళు పోసింది. కొడుకు పరిస్థితిని చూసి ఆజాద్ తండ్రి ఆసుపత్రికి తరలించాడు. కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీవ్ర రక్తస్రావం జరగటంతో అతని పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు చెప్పారు. సుఖ్వంత్ కౌర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు