భద్రకాళి గుడిలో అమ్రపాలి దంపతులు! - MicTv.in - Telugu News
mictv telugu

భద్రకాళి గుడిలో అమ్రపాలి దంపతులు!

February 23, 2018

ఫిబ్రవరి18న జమ్మూలో వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలికి  ఐసీఎస్ అధికారి సమీర్ శర్మతో పెళ్లి అయిన విషయం తెలిసిందే. అయితే అమ్రపాలి దంపతులు శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

పూజారులు కలెక్టరమ్మకు, ఆమె భర్తకు వేదమంత్రాలు చదువుతూ స్వాగతం పలికారు. జమ్మూలో వివాహం జరిగిన తర్వాత శుక్రవారం నాడు కొత్త జంట వరంగల్ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం  కలెక్టర్ క్యాంపు ఆఫీసులో వివాహ విందును కూడా ఏర్పాటు చేశారు.