జమ్మూలో  ఆమ్రపాలి  లగ్గం! - MicTv.in - Telugu News
mictv telugu

జమ్మూలో  ఆమ్రపాలి  లగ్గం!

January 31, 2018

వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి  చేసుకోబోతుందనే  విషయం తెలిసిందే.  జమ్మూ పట్టణానికి చెందిన ఐపీఎస్ అధికారి షమీర్ శర్మను ఆమె  ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకోబోతుంది.  వీరి పెళ్లి  సాంప్రదాయబద్ధంగా జమ్మూలో జరగనుందని  సమాచారం.  

అంతేకాదు  పెళ్లి అయిన తర్వాత  ఫిబ్రవరి 25 నాడు   సికింద్రాబాద్ క్లబ్‌లో రిసెప్షన్  ఏర్పాటు చేయనున్నారు.  ఆమ్రపాలిది  విశాఖపట్టణం. ఆమె తండ్రి ప్రకాశం జిల్లా నరసపురానికి చెందినవారు. అయితే ఉద్యోగ రీత్యా ఆయన విశాఖపట్టణంలో  స్థిరపడ్డారు.  ఆమ్రపాలి  పెళ్లి చేసుకోబోయే  షమీర్ శర్మది జమ్మూ కావడంతో  అక్కడే పెళ్లి చేస్తే  బాగుంటుందని ఇరుకుటుంబాలు నిర్ణయించుకోవడంతో  పెళ్లి బాజాలు  జమ్మూలో మోగనున్నాయి. 2011 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన షమీర్ శర్మ ప్రస్తుతం  డయ్యూ – డామన్‌లో ఎస్పీగా పనిచేస్తున్నారు.