వేగంగా కట్టాలన్న ఆమ్రపాలి - MicTv.in - Telugu News
mictv telugu

వేగంగా కట్టాలన్న ఆమ్రపాలి

October 24, 2017

బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలనే ధ్యేయంగా, వరంగల్ జిల్లాలో కలెక్టర్ ఆమ్రపాలి పలు కార్యక్రమాలు చేపట్టారు. ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న మరుగు దొడ్లను  కలెక్టర్ పరిశీలించించారు. నిర్మాణాలను వేగవంతం చేయాలని  గ్రామస్ధులను ఆమ్రపాలి కోరారు. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, ఎటువంటి రోగాలు రావు, ప్రతి గ్రామంలో పరిశుభ్రతను పాటిచేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని  ఆమ్రపాలి గ్రామస్థులను కోరారు.