కలెక్టర్ ఆఫీసులో..కలెక్టరమ్మ పెళ్లి రిసెప్షన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్టర్ ఆఫీసులో..కలెక్టరమ్మ పెళ్లి రిసెప్షన్ !

February 24, 2018

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఫిబ్రవరి 18న  ఢిల్లీకి చెందిన సమీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఉదయం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కొత్తజంట, అక్కడ కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు.

ఆ తర్వాత సాయంత్రం వరంగల్‌లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమ్రపాలి దంపతుల పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. రాజకీయ నేతలు, జిల్లా అధికారులు మరికొంత మంది ప్రముఖులు హాజరై  దంపతులను ఆశీర్వదించారు. హైద్రాబాద్‌లో కూడా త్వరలో రాజకీయప్రముఖులను, సెలబ్రిటీలను పిలిచి వరంగల్ కలెక్టర్ ఘనంగా విందు ఇవ్వబోతున్నట్లు సమాచారం. తీసుకున్న సెలవులు అయిపోగానే మళ్లీ  కలెక్టర్ విధుల్లో చేరుతుందట ఈ కొత్త పెళ్లి కూతురు.