కేంద్రమంత్రిపై హత్యాయత్నం.. - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రమంత్రిపై హత్యాయత్నం..

April 18, 2018

కేంద్ర నైపుణ్యశాఖ సహాయ మంత్రి  అనంతకుమార్ హెగ్డేపై హత్యాయత్నం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రక్కుతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం నుంచి ఆనంత కుమార్ తృటిలో తప్పించుకున్నారు.ఈ ప్రమాదంపై స్పందించిన ఆనంత్ కుమార్… ‘ నన్ను  చంపేందుకే ఈ దాడి చేశారు.ఎవరో నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. పోలీసులు ఈ విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే ఇది ఖచ్చితంగా హత్యాప్రయత్నమేనని అర్థం అవుతోంది’ అని పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు. ట్రక్కు డ్రైవర్ ఫోటోను కూడా ఆనంతకుమార్ ట్విటర్‌లో పోస్టు చేశారు.