క్రియేటివిటీని తొక్కెయ్యద్దు..హైపర్ ఆది స్కిట్‌పై అనసూయ - MicTv.in - Telugu News
mictv telugu

క్రియేటివిటీని తొక్కెయ్యద్దు..హైపర్ ఆది స్కిట్‌పై అనసూయ

November 26, 2017

జబర్థస్త్‌లో అనాథలపై  ఆది వేసిన డైలాగ్‌కు యాంకర్ అనసూయ వత్తాసు పలికింది. ‘ప్రతీది భూతద్దంలో పెట్టి చూడద్దు, క్రియేటివిటీని తొక్కెయ్యద్దు, లాజిక్స్ వెతికితే  కామెడీ పండదు, మేం నవ్వించడానికి చాలా కష్టాలు పడుతున్నాం. కామెడీ చూసి నవ్వుకోండి అంతేకాని, అందులో తప్పులు వెతకద్దు, జబర్ధస్త్  తెలుగు టీవీ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. దాన్ని తొక్కెయ్యాలని చూడద్దు’ అంటూ అనసూయ తన ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పింది.

కానీ ఇదే అనసూయ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఉన్న ‘ఏం మాట్లాడుతున్నావ్ రా’  అనే డైలాగ్‌ని కొన్నిరోజుల క్రితం తప్పుబట్టింది. తల్లిని కించపరిచే విధంగా ఆ డైలాగ్ ఉందని ఆ సినిమాపై మండిపడింది. ‘అవును కరక్టే తల్లిని కించపరిచేలా ఆ డైలాగ్ ఉంది. మరి జబర్ధస్త్‌లో మమ్మల్ని, మా అమ్మానాన్నల్ని కించపరిచేలా ఆది చెప్పిన డైలాగ్‌లో ఎలాంటి తప్పు నీకు కనిపించడంలేదా అనసూయ’ అని అనాథ పిల్లలు నిలదీస్తున్నారు.

 మీదేమో క్రియేటివిటీ, అవుతలి వాళ్లదేమో తప్పా? మీరు తప్పుచేస్తే దాన్ని ఒప్పుకోరు కాని అవుతల వాళ్లు తప్పుచేస్తే మీడియా ముందుకచ్చి మరీ మండిపడతారు అంతేకదా? అని అనసూయపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.