ప్రైవసీ కోసమే ఫోన్ పగలగొట్టా ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రైవసీ కోసమే ఫోన్ పగలగొట్టా !

February 6, 2018

జబర్దస్త్  యాంకర్ అనసూయ ఈ రోజు సికింద్రాబాద్ తార్నాకలో ఫోటో కోసం వచ్చిన ఓ పిల్లాడి ఫోన్‌ను పగలగొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ పిల్లాడిని,అతని తల్లిని తిడుతూ కోపంగా కారెక్కి వెళ్లిపోయింది. అభిమానంతో ఓ ఫోటోకోసం వెళ్లినందుకు ఇలా ప్రవర్తిస్తుందా? అని ఆ తల్లి తన కొడుకుని వెంట పెట్టుకుని పోలీస్‌స్టేషన్లో అనసూయపై కేసు పెట్టింది. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…అనసూయ తన ట్విట్టర్లో స్పందించింది.

ఇలాంటి వార్తలన్నీ దేశానికి అవసరంలేదు. ఈ ఘటనపై నేను స్పందించాల్సిన అక్కర్లేదు. ఫోన్ పగలకొట్టినందుకు క్షమించండి. అయితే ఇది నిందించదగిన ఘటన కాదు. నాకూ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది.. దానికి భంగం కలిగించినందుకే ఫోన్ పగలగొట్టా’ అని అనసూయ ట్విటర్లో  రాసింది.

ఆమెవన్నీ అబద్ధాలు..

అంతే కాదు ఈ ఘటనకు సంబంధించి ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అనసూయ ఇలా చెప్పుకొచ్చింది. ‘ఇది పూర్తిగా తప్పు. ఆ మహిళ అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. మా అమ్మను చూడటానికి తార్నాకకు వెళ్లా. నేను బయటికి వస్తుండగా ఆమె తన కొడుకుతో కలిసి నా వీడియో తీశారు, నాతో సెల్ఫీకి ప్రయత్నించారు. నేను అప్పుడు సెల్ఫీ దిగే పరిస్థితిలో లేను, అందుకే తిరస్కరించా. కెమెరా దగ్గరికి పెట్టేసరికీ కంగారుపడ్డా. నా ముఖం కప్పుకున్నా, ఇక్కడి నుంచి వెళ్లండి అని వారికి చెప్పి కారులో కూర్చొన్నా. అప్పుడు ఫోన్‌ పగిలిందా? లేదా? అన్న విషయం నాకు గుర్తులేదు’ అని ఆమె అన్నారు.

అయితే ఈవిషయంపై నెటిజన్లు అనసూయపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు వ్యక్తిగత స్వేఛ్చ ఉందని అందుకే ఫోన్ పగలగొట్టా అని అంటున్నారు. కానీ మీరు సెలబ్రిటీలు అంటే పబ్లిక్ ఫిగర్..మిమ్మల్ని అభిమానించే, ఆరాధించే వాళ్లు చాలా మందే ఉంటారు. మీరు బయటకనిపించినప్పుడు  సెల్ఫీలు అడగడం, ఫోటోలు దిగడం కామన్. ఒక్క క్షణం ఆగి  వాళ్లకు ఫోటో ఇస్తే ఎంతో ఆనందించేవాళ్లు. ఆ మాత్రం దానికే మాస్వేచ్చకు భంగం కలిగిందంటూ ఇలా ప్రవర్తిస్తే మిమ్మల్ని అభిమానించే వాళ్లు ఎలా రియాక్టవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి.  ఫోటోకోసం వచ్చిన ఓ చిన్న పిల్లాడి మనసును ఇంతగా బాధించడం, అతని తల్లిని దూషించడం తప్పే…వెంటనే వారికి స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పి, ఫోన్ పగలగొట్టినందుకు  కొత్త ఫోన్ కోనిస్తే  మీరు సంస్కారవంతులు అనిపించుకుంటారు అని  నెటిజన్లు అనసూయను ఉద్దేశించి  కామెంట్లు పెడుతున్నారు.