సోషల్ మీడియా నుంచి అనసూయ అవుట్! - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ మీడియా నుంచి అనసూయ అవుట్!

February 6, 2018

యాంకర్ అనసూయ ఈరోజు తార్నాకలో ఫోటోకోసం వచ్చిన ఓ పిల్లాడి ఫోన్ పలగ్గొట్టడంతో ఆ విషయం కాస్త  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరూ అససూయపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఫోటో దిగడం ఇష్టం లేకపోతే మానేయాలి.

 

ఇష్టం లేకుండా ఫోటో తీస్తే డిలీట్ చెయ్యాలి అంతేకాని ఇలా ఫోన్ పగలగొట్టుకోవడం ఏందని అనసూయపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈఘటనపై అంతటా విమర్శలు వెల్లు వెత్తడంతో అనసూయ ట్విటర్,ఫేస్‌బుక్ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అనసూయ ట్విటర్ అకౌంట్,ఫేస్‌బుక్ అకౌంట్ పనిచేయడం లేదు.