‘రంగస్థలం’లో రంగమ్మగా అనసూయ! - MicTv.in - Telugu News
mictv telugu

‘రంగస్థలం’లో రంగమ్మగా అనసూయ!

February 21, 2018

‘జబర్థస్త్’ యాంకర్ అనసూయ రాంచరణ్ రంగస్థలంలో ఆడి,పాడనుందా ? ఆమెకు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఇచ్చారా? ప్రస్తుతం ఈ వార్త ఫిలింగ్‌నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘రంగస్థలం’లో దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన  ఐటెమ్ సాంగ్ ‘రంగమ్మా రంగమ్మా’ పాటతో కుర్రకారును ఉర్రూతలూగించేందుకు అనసూయ సిద్దమవుతోందట.

ఈపాటను ఫిబ్రవరి 22న సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే విడుదల చేసిన ‘ఎంత సక్కగున్నావే లచ్చిమి’ అనే పాట అందరినీ ఆకట్టుకుంటోంది. మార్చి 30న  ‘రంగస్థలం’ విడుదల కానుండగా, ఈసినిమా ఆడియోను మార్చి18 ఉగాదిరోజు ఆడియో ఫంక్షన్ వైజాగ్‌లో జరగనుంది.