వైరల్ అవుతున్న యాంకర్ సుమ డ్యాన్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

వైరల్ అవుతున్న యాంకర్ సుమ డ్యాన్స్..!

September 14, 2017

యాంకర్ సుమ అద్భుతంగా మాట్లాడుతుందని అందరికి తెలిసిందే. బుల్లి తెర మీద తన మాటలతోనే చాలా మంది ప్రేక్షకులను సంపాదించికుంది. కానీ సుమ డ్యాన్స్ కూడా బాగా చేస్తుందని  నిరూపించింది. ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ నటిస్తున్న “వెలిపడింతె పుస్తకం” మూవీలోని ‘జిమ్మిక్కి కమ్మల్ ‘సాంగ్ కు ఈ మలయాళి కుట్టి చాలా బాగా డాన్స్ చేసింది. ఈ వీడియోని సుమ తన ఫేస్ బుక్ లో పోస్టూ చేస్తూ” జిమ్మిక్కి కమ్మల్ పాట నన్ను ఉర్రూతలూగిస్తోంది”. అని  పోస్టు చేసింది.  ఈ వీడియో ను ఇప్పటికీ 14 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇక చాలా మంది ఈ పాటపై పేరడీలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ప్రముఖ అమెరికా టీవీ హోస్ట్ ‘జిమ్మి కిమెల్ ‘  కు కూడా  ’జిమ్మిక్కి కమ్మల్ ’ పాట తనకు చాలా  నచ్చిందంటూ ట్వీట్ చేశారు.