చంద్రబాబు చిన్నపిల్లాడైపోయాడు..

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిన్నపిల్లాడైపోయారు. గోటీలాడుతున్న పిల్లలను చూసిన బాబు ఆగలేకపోయిన బాబు చిన్నపిల్లాడిలా వారితో కలిసి గోటీలాడారు. అలాగే, కర్రాబిళ్ళా, వాలీబాల్, కోలాటం ఆడుతూ ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Telugu News andhra pradesh chief minister chandrababu naidu played with children in prakasam district .

చంద్రబాబు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భముగా ఈ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టులకు శంకుస్థాపన చేసి పైలాన్లను ఆవిష్కరించారు. అనంతరం జన్మభూమి-మా ఊరు సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు, పిల్లల ఆటల పోటీలను సందర్శించారు. చిన్నారులు గోళీలు, కర్రాబిళ్ళా ఆడుతుండడం చూసి చంద్రబాబు కూడా వారితో చేరారు. కాసేపు ఆడి చిన్నారులను ఉత్సాహపరిచారు.

Telugu News andhra pradesh chief minister chandrababu naidu played with children in prakasam district