mictv telugu

ఏపీలో మగవారిపై ఆడవారి పైచేయి..

January 12, 2019

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లెక్కలు తేలాయి.  రాష్ట్ర ఎన్నికల కమిషన్  ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియా దీన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో  మొత్తం 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు ఉన్నారు. వివరాలనున ఎన్నికల సంఘం వెబ్ సైట్‌లో చూడొచ్చు. జాబితాలో పేరు లేనివారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.  

Telugu news Andhra Pradesh final voters list released by election commission women outnumber 3 thousand third genders .

మొత్తం 3,69,33,091 ఓట్లలో పురుషులు 1,83,24,588 మంది, మహిళా ఓటర్లు 1,86,04,742.. థర్డ్ జెండర్ ఓటర్లు 3,761 మంది ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 40,13,770 మంది, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.  

ఓటర్లు జిల్లావారీగా:
1. శ్రీకాకుళం – 20,64,330
2. విజయనగరం – 17,33,667
3. విశాఖ – 32,80,028
4. తూర్పు గోదావరి జిల్లా – 40,13,770
5. .గో. జిల్లా – 30,57,922
6. కృష్ణా జిల్లా – 33,03,592
7. గుంటూరు – 37,46,072
8. ప్రకాశం జిల్లా – 24,95,383
9. నెల్లూరు – 22,06,652
10. కడప – 20,56,660
11. కర్నూలు – 28,90,884
12. అనంతపురం – 30,58,909
13. చిత్తూరు – 30,25,222

Telugu news Andhra Pradesh final voters list released by election commission women outnumber 3 thousand third genders