ఆ మూడు రోజులు టోల్ టాక్స్ రద్దు

సంక్రాతి పండుగను పురస్కరించుకొని ప్రజలు అందరూ వారి స్వంత ఊళ్లకు పయనమయ్యారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి.

Telugu News andhra pradesh government toll tax exemption for three days .

ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్తున్నవారికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండగ సందర్భంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 12, 13, 16వ తేదీల్లో టోల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సొంతూరు వెళ్తున్న ప్రయాణికులకు భారీ ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Telugu News andhra pradesh government toll tax exemption for three days