ఏపీ టెట్ షెడ్యూల్ ఇదీ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ టెట్ షెడ్యూల్ ఇదీ..

December 13, 2017

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్) షెడ్యూల్  విడుదలైంది.  ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  బుధవారం దీన్ని విడుదల చేశారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  టెట్‌ను నిర్వహిస్తోంది. టెట్ అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ నియమాక పరీక్షకు అర్హులు అవుతారు. దీన్ని విద్యాశాఖ నిర్వహిస్తోంది. టెట్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం cse.ap.gov.inవెబ్‌సైట్‌లో చూడొచ్చని మంత్రి తెలిపారు.

టెట్ షెడ్యూల్…

-14న నోటిఫికేషన్‌ విడుదల

– 18 నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం

-ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణకు అవకాశం

-జనవరి 9వ తేదీనుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

-జనవరి 17 నుంచి 27వరకూ టెట్‌ పరీక్షలు

-ప్రాథమిక కీని జనవరి 29న ప్రకటిస్తారు.

– దీనిపై అభ్యంతరాలు, ఫిర్యాదులను ఫిబ్రవరి 2వరకూ స్వీకరిస్తారు.

– తుదికీని ఫిబ్రవరి 6న ప్రకటిస్తారు.