మంత్రిని గుడిసెలోకి గుంజుకెళ్లిన అవ్వ! - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రిని గుడిసెలోకి గుంజుకెళ్లిన అవ్వ!

December 19, 2017

ఆ అవ్వ తన సమస్యలను ఎన్ని సార్లు అధికారులకు విన్నవించినా  ఫలితం లేకపోయింది.  ఇక కోపం పట్టలేక.. తమ గ్రామానికి వచ్చిన మంత్రిని.. ఈ దరిద్రమేంటో చూద్దువుగానీ రా అంటూ తన గుడిసెలోకి లాక్కెళ్లింది.  ఈ ఘటన ఏపీలోని  చిత్తూరు జిల్లా పెదపంజాణి మండంలం చావనేరులో జరిగింది.చాపనేరు పర్యటనకు వెళ్లిన మంత్రి అమరనాథరెడ్డిని ‘ మా గుడిసెను చూద్దువుగాని రా నాయనా ’అంటూ  ఒక  అవ్వ చెయ్యిపట్టుకుని లాక్కెళ్లింది.  తనకు, తన  భర్తకు ఫించన్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఎండకు, వానకు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఈ గుడిసెలోనే ఉంటుున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం రేకుల ఇల్లు అయినా ఇప్పించాలి’ అని  ప్రాధేయపడింది. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆమెకు పక్కా ఇల్లును మంజూరు చేయాలని అధికారులను  ఆదేశించారు. ఆమెకు, ఆమె భర్త  ఫించన్ వెంటనే వచ్చే  విధంగా చూడాలని ఆదేశించారు.