ఏంజెలీనా అవుదామనుకుని ఏమైందో చూడండి… - MicTv.in - Telugu News
mictv telugu

ఏంజెలీనా అవుదామనుకుని ఏమైందో చూడండి…

December 1, 2017

అభిమానం శృతి మించి ఓ యువతి  తన ముఖాన్ని అందహీనంగా మార్చుకుంది. ఇరాన్‌కు చెందిన 19ఏళ్ల సహర్ తబర్‌కు హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీకి వీరాభిమాని. తబర్ అందంగా ఉన్నా కూడా జోలీలా లేనని తరుచూ బాధపడేది. ఏంజెలీనా లాగా మారేందుకు ముఖానికి ఏకంగా 50 సర్జీలు చేయించుకుంది. అంతేకాదు డైటింగ్ చేసి 40 కేజీల బరువు మించకుండా చూసుకుంది.ఇప్పడు ఆమె ముఖం చాలా దారుణంగా మారిపోయింది. అయినప్పటికి తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తబర్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయి,దాదాపుగా ప్రస్తుతం 4లక్షలకు ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అయితే వారిలో చాలా మంది ఆమెను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. నీ ముఖంపై ఎవరైనా బాంబు వేశారా?జాంబీ నువ్వు చాలా భయకరంగా ఉన్నావ్, సర్జరీ కంటే ముందు చాలా అందంగా ఉన్నావ్. నువ్వసలు మనిషివేనా  అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవరి లైఫ్‌కి వాళ్లే హీరో, హీరోయిన్లు అని తెలుసుకుంటే  ఇటువంటి పిచ్చి పనులు ఎవ్వరూ చెయ్యరు అని కొందరు అంటున్నారు.