mictv telugu

ఇంత టెంపర్ పెళ్లికొడుకును చూసుండరు..

January 12, 2019

పెళ్లి అంటే శుభకార్యం మాత్రమే కాదు. సరదాలకు, ఆటపాటలకు కూడా వేదికే. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు పెళ్లిలోనూ అతి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటారా? ఈ వీడియో చూడండి.

పెళ్లి తర్వాత కొత్త జంటకు భోజనాలు పెడుతున్నారు. పెళ్లికొడుకును వరసైన వారు, దోస్తులు ఆటపట్టిస్తున్నారు. వరుడు నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. కానీ ర్యాగింగ్ శ్రుతిమించింది. అయినా పెళ్లికుమారుడు ఓర్చుకుంటూ నవ్వాడు. జంటకు ఒకే ఆకులో భోజనం వడ్డించారు, కూరలు పెట్టారు.. అన్నం పెట్టారు. పెళ్లికూతురు సరదాగా అన్నమంతా తనవైపుకు లాక్కుంది. సరదా సాగుతోంది. ఉన్నట్టుండి పెళ్లికొడుక్కి కోపమొచ్చింది. చప్పున లేచి భోజనం బల్లను తోసేసి చరచరా వెళ్లిపోయాడు. దీంతో చుట్టుపక్కల జనం బిత్తరపోయారు. మరీ ఇంత కోపమా? రేపు పెళ్లాంతో కాపురం ఎలా చేస్తాడమ్మా అని అమ్మలక్కలు, మా బావతో కష్టమేనే అని బావమరుదులు అనుకున్నారు. ఈ తతంగం కేరళలో జరిగింది.