ఉత్తమ కోచ్  రేసులో కుంబ్లే   - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమ కోచ్  రేసులో కుంబ్లే  

November 2, 2017

క్రికెట్ జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పోటీకి రెడీ అవుతున్నాడు. క్రికెట్ కోచ్ పదవికోసం కాదు, ‘కోచ్ ఆఫ్‌‌ది ఇయర్ అవార్డు’ బరిలో ఉన్నాడు. ఈ అవార్డుల  కార్యక్రమం నవంబర్ 11న ముంబైలో  జరగనుంది. ఆర్పీ -ఎస్ జీ గ్రూప్, విరాట్ కోహ్లీ ఫౌండేషన్ సంయుక్తంగా  ఈ అవార్డులను ఇవ్వనున్నారు.

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి, పిటి ఉష, షూటర్ అంజలి భగవత్, హకీ మాజీ కెప్టెన్ అర్జున్ హాలప్పల జ్యూరీ బృందం విజేతలను ఎంపిక చేయనుంది. 8 విభాగాల్లో అవార్డులను విజేతలకు ఇవ్వనున్నారు. క్రికెట్, హాకీ, చదరంగం , అథ్లెట్స్, టెన్నీస్  పలు విభాగాల క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.

అవార్డు రేసులో అనిల్ కుంబ్లేతో పాటు బిశ్వేశ్వర్ నంది(జిమ్నాస్టిక్స్), బల్వన్ సింగ్ ( కబ్బడీ), హరీందర్ సింగ్ ( హాకీ) , విజయన్ దవేచ( గోల్ఫ్) పోటీ పడుతున్నారు. క్రీడాకారులు  పూజారా,రవిచంద్రన్ ఆశ్విన్, హార్ధిక్ పాండ్యా,దీప్తి శర్మ, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కూర్, పీవి సింధు, సాక్షీ మాలీక్, కబడ్డి ఆటగాడు ప్రదీప్ నర్వాల్ , ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునిల్ చెత్రి, హాకీ స్టార్ రూపిందర్ సాల్‌సింగ్‌లు అవార్డు కోసం పోటీ పడుతున్నారు.