‘ అవినీతిని అంతం చేయటం, ఎన్నికల వ్యవస్థను సంస్కరించటం, రైతును బతికించటం ’ అనే మూడు నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేయటానికి ఈనెల 17న భాగ్యనగరానికి అన్నాహజారే రానున్నారు. ఏవీ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పై మూడు అంశాల మీద ప్రసంగించనున్నారు.మార్చి 23 నుంచి ఢిల్లీలో తలపెట్టనున్న నిరాహార దీక్షకు సన్నాహంగా ఈ సభ కొనసాగనున్నది. ఈ కార్యక్రమాన్ని ఇండియా అగెనెస్ట్ కరప్షన్ వలంటీర్స్ సంస్థ ( ఐఏసీవీఏ ), సోషల్ పోస్ట్లు నిర్వహిస్తున్నాయి.