తెలుగు ‘అన్న’కు ఆక్స్‌ఫర్డ్‌ సత్కారం! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు ‘అన్న’కు ఆక్స్‌ఫర్డ్‌ సత్కారం!

October 26, 2017

తోటబుట్టిన వాళ్లనే కాదు, మనతో సంబంధంలేని వాళ్లను కూడా అన్న అని సంబోధించడం మనకు అలవాటు. ‘అన్న’ అనే పదానికి తెలుగులో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

అయితే తాజాగా ఈ పదాన్ని  ప్రముఖ అంతర్జాతీయ నిఘంటువు ఆక్స్‌ఫర్డ్‌లో  చేర్చారు. కొత్త ఆక్స్‌వర్డ్ డిక్షనరీలో దాదాపు 70 భారతీయ పదాలకు చోటు దక్కింది. తెలుగుతో పాటు ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ తదితర భాషలకు చెందిన పదాలను ఆక్స్‌ఫర్డ్‌లో చేర్చారు.

అయితే ఇంతకు ముందు  రూపాయిలో ఆరో వంతు అయిన ‘అణా’ అనే పదం ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ఉండేది. దాని స్థానంలో  అన్న (ANNA)  అనే  పదాన్ని చేర్చారు. ఉర్దూ పదం ‘అబ్బా’ (తండ్రి), అచ్చా, బాపు, బాడా దిన్‌, బచ్చా, సూర్య నమస్కార్‌ వంటి పదాలు కూడా ఆక్స్‌ఫర్డ్  నిఘంటువులో చోటు సంపాదించాయి.