నిరాహారదీక్షలో నిండుభోజనాలు.. ఆ పార్టీ గుట్టురట్టు - MicTv.in - Telugu News
mictv telugu

నిరాహారదీక్షలో నిండుభోజనాలు.. ఆ పార్టీ గుట్టురట్టు

April 4, 2018

రాజకీయాల్లో రంగులు మారే ఊసరవెల్లులు ఉంటారని చెప్పగా వినడం తప్ప చూసింది అరుదే. అలాంటి ఘటనే తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంది.  కావేరి మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే అసలు అసలు రంగు బయటపడింది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్టు కలరిచ్చిన అన్నాడీఎంకే రంగు బయటపడింది. బోర్డు కోసం ఆ పార్టీ చేస్తున్న నిరాహార దీక్ష దొంగదీక్ష అని తేలిపోయింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. వీరు కూడా భోజనం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
నిరాహార దీక్ష మధ్యలో పక్కకు వచ్చి, కడుపునిండా భోజనాలు లాగిస్తున్న నేతల ఫొటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు మద్యం తాగుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే చేస్తున్న నిరాహార దీక్ష ఒట్టిదే అని కామెంట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే వీరు పార్లమెంటులో అల్లరి చేస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.