మరో 24 గంటలు వాతావరణం ఇలానే - MicTv.in - Telugu News
mictv telugu

మరో 24 గంటలు వాతావరణం ఇలానే

March 17, 2018

ముదురుతున్న ఎండల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్‌లో అక్కడక్కడా చిరుఝల్లులు కురిసాయి. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ మీదుగా తేమగాలులు వీస్తుండడంతో శుక్రవారం నుండి వాతావరణం చల్లబడింది.దీంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన స్వల్ప అల్పపీడనం కారణంగా మరో 24 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖాధికారులు అధికారులు పేర్కొన్నారు. ఒక్కసారి కురిసి ఆగిపోయిన చినుకుల దెబ్బకు శనివారం ఎండలు రెట్టింపు స్థాయిలో ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నారు.