రంగంలోకి రానా తమ్ముడు  - MicTv.in - Telugu News
mictv telugu

రంగంలోకి రానా తమ్ముడు 

October 21, 2017

దగ్గుపాటి వంశం నుండి మరొక నటుడు త్వరలోనే తెరపైకి రానున్నాడు. తొలుత వెంకటేష్ హీరోగా వచ్చాడు. ఆ తర్వాత రాణా వచ్చి పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. తాజాగా రానా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా వెండితెరపై మెరవడానికి రంగం సిద్ధమవుతోంది. అభిరామ్ వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్ లో నటిస్తాడనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టాయి.

కానీ అవన్నీ అవాస్తమయ్యాయి. అభిరామ్ నటనలో వైజాగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు తండ్రి సురేష్ బాబు తెలిపారు. మరి అభిరామ్ ఏ దర్శకుడి ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నాడనే వార్తలను బ్రేక్ చేస్తూ దర్శకుడు ఎవరన్న వార్త  స్పష్టంగా బయటకు వచ్చింది. గతంలో మోహన్ బాబు, శర్వానంద్‌ల కాంమొనేషన్‌లో వచ్చిన ‘ రాజు మహారాజు ’ సినిమాకు దర్శకత్వం వహించిన శంకర్ నాథ్ దుర్గే.. అభిరామ్‌ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. మరి అభిరామ్ సరసన్ హీరోయిన్ ఎవరు ? నిర్మాతగా సురేష్ బాబే వుంటాడా ? ఇతర సాంకేతిక నిపుణులు.., వంటి వివరాలన్నీ అధికారికంగా త్వరలోనే బయటికి రానున్నాయి.