మరో బీజేపీ నేత రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

మరో బీజేపీ నేత రాజీనామా

March 20, 2018

ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలో ఛైర్మన్ పదవికి  బీజేపీ నేత లక్ష్మీపతి రాజీనామా చేశారు. ఆయన ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి, రాజీనామా లేఖను అందించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో టిడిపి సంబంధాలు తెంచుకున్నప్పుడు తాను పదవిలో కొనసాగటం కరెక్ట్ కాదు అనిపించిందన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు మా పార్టీ ఏమేం చేసిందో ప్రజల్లోకి వెళ్లి వివరిస్తానని తెలిపారు. పవన్, జగన్‌లను బీజేపీతో లింకు కలపటం అర్థరహితం అన్నారు. పదిరోజుల క్రితం కామినేని, మాణిక్యాలరావు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇంతలో లక్ష్మీపతి రాజీనామా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.