ముస్లింలు మరో దేవుణ్ని కొలవొద్దు  - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలు మరో దేవుణ్ని కొలవొద్దు 

October 21, 2017

దీపావళి రోజున వారణాసిలో ముస్లిం మహిళలు అత్యంత అట్టహాసంగా దీపాలను వెలిగించి తమ మత సామరస్యాన్ని చాటుకున్నారు. కానీ అదే వారు చేసిన మహా పాపం అన్నట్టు యుపీలోని ముస్లిం సంస్థ దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌ తాజాగా మరో ఫత్వా జారీ చేసింది. ముస్లిం మహిళలు గాని, పురుషులు గాని అల్లాను తప్పించి ఏ దేవుడిని ఆరాధించరాదని, అలా చేసిన యెడల వాళ్ళు ముస్లింలు కారని, ఇస్లాంకు వ్యతిరేకమని ఫత్వా జారీ చేశారు. ఈ మధ్య ఫత్వాలు జారీ చెయ్యటం పరిపాటైంది.  

 పెళ్ళిళ్ళలో సంగీత్ నిషేధించాలని జమ్మూ కాశ్మీర్‌లోని మజ్లిసె శౌరా ఫత్వా చేసింది. అది మరవక ముందే సోషల్ మీడియాలో ముస్లింలు ఫోటోలు అప్‌లోడ్ చెయ్యొద్దని, అలాగే ముస్లిం మహిళలు ఐబ్రోస్ కట్ చేసుకోవద్దని యూపీలోని ఇస్లాం సంస్థ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ సంస్థ ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు తాజాగా అదే సంస్థ ఈ ఫత్వా జారీ చేసింది. ఈ ఫత్వా దేశ ఐకమత్యాన్ని దెబ్బ తీసేలా వుందంటున్నారు చాలా మంది ముస్లిములు. దేశంలో ఐకమత్యం కోసం అన్నీ మతాల వారు ప్రయత్నిస్తుంటే ఇలా ఫత్వా జారీ అవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.