నెంబర్ వన్ ర్యాంక్‌.. మేరీ కోమ్‌కే

భారతీయ స్టార్ బాక్సర్ మేరీ కోమ్ మరో అరుదైన ఘనత సాధించింది. ఇటీవల ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచింది. అసాధారణ రీతిలో ఆరోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మేరీ కోమ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బాక్సర్ మేరీ కోమ్ కావడం విశేషం.

Telugu news Another high for ‘Magnificent Mary’ Kom to become World No.1 in AIBA rankings.

గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన టోర్నీలో 48 కేజీల విభాగంగా ఆమె విజేతగా నిలిచింది. ఈ కేటగిరీలో 1700 పాయింట్లతో మేరీ టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే 2020 ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలని భావిస్తున్న ఆమె 51 కేజీల విభాగంలో పోటీ పడాల్సి ఉంటుంది. గేమ్స్ నుంచి 48 కేజీల విభాగాన్ని తొలగించారు. గత సంవత్సరం మేరీ మంచి ఫామ్‌లో ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్, పోలాండ్‌లో జరిగిన మరో టోర్నీలోనూ గోల్డ్ మెడల్స్ సాధించింది.

Telugu news Another high for ‘Magnificent Mary’ Kom to become World No.1 in AIBA rankings