మరో  రికార్డ్ నెలకొల్పిన జీహెచ్ఎంసీ - MicTv.in - Telugu News
mictv telugu

మరో  రికార్డ్ నెలకొల్పిన జీహెచ్ఎంసీ

February 12, 2018

హైదరాబాద్ జీహెచ్ఎంసీ మరో రికార్డు సృష్టించింది.  స్వచ్ఛభారత్‌లో భాగంగా గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది మే నెలలో 5,058 మంది విద్యార్థులతో రోడ్లను ఊడ్చి రికార్డు సృష్టించింది. ఆ రికార్డును బ్రేక్ చేసింది హైదరాబాద్ జీహెచ్ఎంసీ. ఏకంగా 15 వేల మంది విద్యార్థులతో రోడ్లు ఊడ్చి, పది సూత్రాల ప్రతిజ్ఞ నిర్వహించి రికార్డ్ నెలకొల్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌​ఎంసీ ఆధ్వర‍్యంలో‘ స్వచ్చ సర్వేక్షన్‌ ’కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా బాగ్‌ లింగంపల్లిలో సోమవారం 15 వేల మందితో రోడ్లను ఊడ్చి, స్వచ్ఛతకై పది సూత్రాల ప్రతిజ్ఞ నిర్వహించారు. వేలాది మంది  వివిధ కళాశాలల విద్యార్థులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు, జీహెచ్‌ఎంసీ కార్మికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, కేటీఆర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్,  జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.