వాట్సాప్‌లో మరో సూపర్  ఫీచర్.. డేటా డౌన్‌లోడ్ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్‌లో మరో సూపర్  ఫీచర్.. డేటా డౌన్‌లోడ్

February 15, 2018

మరో సరికొత్త ఫీచర్‌తో వాట్సాప్ వినియోగదారులను సంబరపరచనున్నది. యూజర్లు పంపే మెసేజ్‌లు,  ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకునే వెసలుబాటను తీసుకురానుంది. ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఇటువంటి వెసులుబాటు ఉండగా ఇప్పుడు వాట్సాప్‌ ఫేస్‌బుక్ దారిలో యూజర్లకు కూడా దాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే 25లోపు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

యూజర్లు తమకు కావాల్సిన డేటాను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అకౌంట్స్‌లోకి వెళ్లి ‘ డౌన్‌లోడ్ మై డేటా ‘పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 20 రోజుల తరువాత తమకు కావాల్సిన డేటా అందుబాటులోకి వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం తెలియజేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన నెలరోజుల్లో డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డేటా సీఎస్‌వి, జిప్ ఫార్మాట్‌లలో వుంటుందట. డేటాను డౌన్‌లోడ్ చేసుకున్నాక ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే మొదటినుండి మొదలు పెట్టాలంటున్నారు.