కడపలో మరో స్వాతి.. - MicTv.in - Telugu News
mictv telugu

కడపలో మరో స్వాతి..

February 6, 2018

అక్రమ సంబంధాన్ని అడ్డులేకుండా కొనసాగించే  ప్రయత్నంలో మరో ‘స్వాతి’ తన భర్తనే హతమార్చింది. నాగర్ కర్నూల్‌లో భర్తను చంపిన స్వాతి ఉదంతం మరవక ముందే.. అలాంటి దారుణాలు పునరావృతమవడం పలువురిని కలిచి వేస్తున్నది. తాజాగా ఈ దారుణం కడపజిల్లాలో జరిగింది. తాళి కట్టిన భర్త కన్నా ప్రియుడి మోజే బాగుందనుకొని భర్తలను కడతేరుస్తున్న ఇలాంటి ఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

చక్రాయిపేట మండలం, కల్లూరుపల్లికి చెందిన శంకర్‌నాయక్‌, శైలజ దంపతులు. శైలజ  కొన్నాళ్లుగా భర్త స్నేహితుడైన  మహేశ్వరరెడ్డి అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ సంగతి శంకర్ నాయక్ కు తెలిసి, మందలించాడు. దీంతో శైలజ.. భర్తను అడ్డు తొలగించుకోవడానికి పక్కా పథకం వేసింది.

 శంకర్‌నాయక్‌ జనవరి 24న వేంపల్లి మండలం, మోతుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని శైలజ.. ఏమీ ఎరగని ఎల్లమ్మలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారణంలో ఆమే హంతకురాలని తేలింది. ఆమె కొంతమంది కిరాయి హంతకులకు డబ్బులిచ్చి భర్తను ఒక వాహనంతో ఢొకొట్టి చంపినట్లు తెలిసింది.