mictv telugu

రేపిస్టును కుట్టి యువతిని కాపాడిన చీమలు

January 28, 2019

ఆపదలో వున్నవాళ్లను ఆదుకోవడానికి ఎవరొచ్చినా ఆ టైంకు వాళ్లు దేవుళ్ళ కన్నా ఎక్కువగానే కనిపిస్తారు. ఓ యువతిని అత్యాచారం చేయాలనుకున్నాడొకడు. ఆమె ఎంత తప్పించుకుందామన్నా వీలు లేకుండా ఆమెతో తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అంతా నిర్మానుష్యంగా వుంది. దరిదాపుల్లో ఒక్క మనిషి కూడా లేడు. ఇంక తన పని అయిపోయినట్టే అనుకుందా యువతి. కానీ ఆ కామాంధుడి పని పట్టాయి చీమలు. కుప్పలుగా దాడిచేసి కామంతో కళ్ళు మూసుకుపోయిన అతని కళ్లు తెరిపించాయి. దీంతో సదరు యువతి హమ్మయ్య అనుకుంది.

Telugu news Ants save 16-year-old from being raped when insects started biting her would-be attacker in Indonesia 

ఈ ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.  16 ఏళ్ల ఓ టీనేజ్ యువతి, 29 ఏళ్ల టోని ఐర్వాన్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లింది. ఇద్దరూ కొత్త కొత్త ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో టోని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తనతో సెక్స్ చేయాలని బలవంతం చేయసాగాడు. అందుకామె ఒప్పుకోలేదు. కారు అలా పోనిస్తున్నాడు. మార్గం మధ్యలో ఓ గ్రామం రావడంతో అతడి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. టోని ఆమెను పట్టుకొని తీసుకొచ్చి మళ్లీ కారెక్కించాడు.

మధ్యలో మరొక ఊరు వచ్చింది. కారును వాష్ చేయాలని అక్కడ ఆపాడు. అక్కడినుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పొదల్లోకి లాక్కెల్లి అమ్మాయిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఇంతలో చెట్లలో వున్న నల్ల చీమలు ఒక్కసారిగా అతని మీద దాడికి దిగాయి. ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో చీమలు అతడ్ని కుట్టడంతో కుయ్యోమొర్రో అన్నాడు. దీంతో ఆమె అతడి బారినుంచి తప్పించుకుని అక్కడినుంచి పారిపోయింది. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు టోని ఐర్వాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు కేసులు నమోదు చేశారు. టోనీ చేసిన నేరానికిగాను అతనికి మూడు నుంచి 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. తన మానప్రాణాలు కాపాడిన చీమలకు థాంక్స్ చెప్తున్నానని పేర్కొందామె.

Telugu news Ants save 16-year-old from being raped when insects started biting her would-be attacker in Indonesia