ఈమధ్యే క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అప్పుడే భర్తను భయపెట్టిందండి..కానీ నిజ జీవితంలో కాదు ఓ సినిమాలో తన నటన చూపించి. అనుష్క శర్మ నటించిన ‘పరి’ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో అనుష్క నటన అందరినీ భయపెడుతోంది.
ఈసినిమా ట్రైలర్ చూసిన అనుష్క భర్త విరాట్ కూడా ‘తను ట్రైలర్ చూసి భయపడినట్లు’ తెలిపాడు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులను ఇంకెంత భయపెడుతుందో మరి.