కొత్త లుక్‌లో అనుష్క - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త లుక్‌లో అనుష్క

November 28, 2017

దక్షిణాది  సినీ  పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.  సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన  తరువాత సింగం3, ఓం నమో వెంకటేశాయ చిత్రాలలో నటించింది. వాటిలో ఆమె లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.

టాలీవుడ్‌లో ఆమె  సినీ కెరియర్ ముగిస్తుందని ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం స్వీటీ తన కొత్త లుక్‌తో దర్శనమించింది. భాగమతి మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న అనుష్క ఓ ఆసక్తికర ఫోటోను సోషల్ మీడియాలో  ఫోస్టు చేసింది. హెయిర్ స్టైల్ మార్చి బాబ్ కట్‌లో చాలా స్లిమ్‌గా కనిపించింది. ఈ ఫోటోతో పాటు ‘కలలు మాయలతో నిజం కావు. కఠోర శ్రమ, నిబద్ధతతో చెమట చిందిస్తేనే సాకారమవుతాయి’ అంటూ కామెంట్ చేసింది.