అవతార్ 2కు వన్నెలు అద్దుతున్న తెలుగు అమ్మాయి ! - MicTv.in - Telugu News
mictv telugu

అవతార్ 2కు వన్నెలు అద్దుతున్న తెలుగు అమ్మాయి !

November 30, 2017

పట్టుదల ఉండాలే కాని  ఏదైనా సాధించగలమని  నిరూపించింది ఆశ్రితా కామత్. ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న పల్లెటూరిలో పుట్టిన ఆశ్రితా కామత్  టెక్నికల్ డిపార్టుమెంటులో ఆర్ట్ డైరెక్టర్‌గా  తన సత్తా చూపించి ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు దర్శకుడు జేమ్స్ కెమరాన్ తీస్తున్న అవతార్ 2 కోసం పని చేసే అవకాశం దక్కించుకుంది.

బాలీవుడ్‌లో ‘జిందగీ న మి లేగి దోబారా’ చిత్రానికి పని చేసిన ఆశ్రితా తనకు బాలీవుడ్ కంటే హాలీవుడ్ నుంచే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని అక్కడే సెటిల్ అయింది. ఆమె ‘కాంగ్-స్కల్ ఐల్యాండ్,‘ ‘పసిఫిక్ రిం బిఎప్టి’ లాంటి పెద్ద సినిమాలకు కూడా పని చేసింది. స్టీవెన్ స్పీల్బర్  దర్శకుడితో ‘ బిఎఫ్టి’ సినిమాకు పని చేశాక, ఆమెకు కెమరాన్‌తో పని చేసే అవకాశం కలగడంపై ఆశ్రిత తన ఆదృష్టంగా భావిస్తోంది.  అమెరికన్ ఫిలిం ఇన్సిట్యూట్ కంజర్వేటరిలో ప్రొడక్షన్ డిజైన్ కోర్స్ లో ఎంఎఫ్ఎ పట్టా పొందిందిఆశ్రిత.  స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్‌లో రజతం సాధించింది.