రామా.. కృష్ణా.. ఇదేం పని ? శమంతకమణి  ఆగ్రహం - MicTv.in - Telugu News
mictv telugu

రామా.. కృష్ణా.. ఇదేం పని ? శమంతకమణి  ఆగ్రహం

November 23, 2017

తెలుగుదేశం పార్టీ మంత్రి యనమల రామకృష్ణుడిపై ఆ పార్టీకి చెందిన  ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ దళితులు అంటే చిన్నచూపా, మా ఇంట్లో జరిగే  వివాహలకు కూడా రానివ్వరు. అదే మీ వాళ్ల పెళ్ళిళ్ళు జరిగితే మాత్రం శాసనసభకు ,శాసనమండలికి  సమావేశాలనే వాయిదా వేస్తారా ? ’ అని యనమలపై శమంతకమణి  విరుచుకు పడ్డారు. బుదవారం శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసిన తరువాత లాబీల్లో యనమల శమంతకమణి  పరస్పరం ఎదురు పడ్డారు. ఈ సందర్బంగా యనమలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘ ఏమయ్యా రామకృష్ణ గారు మా దళితులకు ఎలాగూ పదవులు ఇవ్వరు. గౌరవం కూడా ఇవ్వరు, కనీసం మా ఇళ్లల్లో వివాహలు  జరుగుతుంటే ఎవరినీ రానివ్వకుండా చేశారని ’ మండిపడింది. ‘ ఏం మా ఇళ్లల్లో శుభకార్యలకు ఎవరు రాకూడదా? ఇదేం న్యాయమయ్యా మీకు ’ అని నిలదీసింది. సమాధానం చెప్పలేక యనమల మౌనంగా ఉండిపోయారు. తన మనవరాలి( శింగనమల ఎమ్మెల్యే ( ప్రభుత్వం విప్ యామినిబాల కుమార్తె ) పెళ్లి ఈ నెల 16న ఆనంతపురంలో జరిగింది. మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీందరినీ ఆహ్వానించగా వారిని రానివ్వకుండా పోలవరానికి తీసుకెళ్లారు. అదే  పయ్యావుల కేశవ్ సోదరుడు శ్రీనివాస్ కుమార్తె  పెళ్లి 23న   కర్నూల్ జిల్లా రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కుమారుడితో జరుగుతుందని ఏకంగా రెండు సభలకు రెండు రోజులు సెలవులు ఇచ్చేశారని అన్నారు.