ఏపీలో హిజ్రాలకు రూ.1500 పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో హిజ్రాలకు రూ.1500 పెన్షన్

December 16, 2017

ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, మంత్రుల సమక్షంలో జరిగిన కేబినేట్ సమావేశంలో ఏపీలోని హిజ్రాలకు రూ.1500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు హిజ్రాలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వాళ్లు వ్యాపారం చేసుకోవడానికి రుణాలు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా తొమ్మిది మండలాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు  సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే మండలాల ఆమోదానికి..లిస్ట్ ను గవర్నర్‌కు పంపించామని మంత్రులు అన్నారు.