ఇది కిట్ల కాలం గురూ...! - MicTv.in - Telugu News
mictv telugu

ఇది కిట్ల కాలం గురూ…!

December 16, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్  పండుగల సందర్బంగా ప్రజలకు కానుకను ఇవ్వనుంది. జనవరి1 నుంచి ‘చంద్రన్న కానుక’ పేరిట సరుకులను పంపిణి చేయనున్నట్లు  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.ఆయన  మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల లబ్ధిదారులకు చంద్రన్న కానుకలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

దీని ద్వారా రూ.226 విలువ చేసే ఆరు రకాల వస్తువులను ఇస్తామన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి అర కిలో బెల్లం, అర కిలో శెనగపప్పు, కిలో గోధుమపిండి, అర లీటర్‌ పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా ఇవ్వనున్నారు.

కాగా, క్రిస్మస్ సందర్భంగా 19 లక్షల మందికి చంద్రన్న క్రిస్మన్ పేరుతో  350 విలువైన వస్తువులు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం పంపిణి చేస్తున్న చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్  కానుకల్లో నాణ్యత లోపిస్తే తమనకు వెంటనే ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రజలకు సూచించారు. మరోవైపు వేలిముద్రల వినియోగదారులకు ఈ నెల 17 నుంచి 20 వరకు రేషన్ బియ్యం దఅందిస్తామని చెప్పారు. రేషన్ షాప్ ద్వారా ఇచ్చే కందికప్పను రెండు కిలోలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నామని మంత్రి తెలిపారు.