mictv telugu

చంద్రబాబూ ప్రకటించారు.. రైతుకు 10 వేలు

February 13, 2019

ఎన్నికలు దగ్గరపడ్డంతో అటు నానా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రైతు మంత్రం జపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రకటించారు. ఒక్కో రైతుకు ఏడాదికి 10 వేల సాయాన్ని రెండు దఫాలుగా అందజేయాని కేబినెట్ ఈ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయించింది. ఇందులో రూ.6 వేలు కేంద్రం ప్రకటించిన సాయమే. కేంద్రం ఇచ్చే రూ. 6వేల పథకానికి అర్హత లేని రైతులకు కూడా రూ.10 వేల సాయాన్ని అందించాలని తీర్మానించారు.Telugu news Ap cm chandrababu naidu announces annadata sukhibhava farmer incentive support scheme Rs. 10,000 for farmer ఖరీఫ్, రబీలో ఒక్కో సీజన్‌కు రైతులకు రూ.5వేలు సాయం అందిస్తామని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.  కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. కేంద్రం రూ. 6వేల పథకానికి ఎన్నో ఆంక్షలు పెట్టిందని, కానీ తాము మాత్రం రైతులందరికీ ఇస్తామని ప్రకటించారు.  ఫిబ్రవరి చివరినాటికి ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ, రైతు రుణ మాఫీ చెల్లింపులు పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని 76.21 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. వాటికి రూ.10 వేల చొప్పున సాయం అందించాలంటే రూ.7,621 కోట్లు కావాలి.

కేబినెట్ ఇతర నిర్ణయాలు..

-డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్లతో సిమ్ కార్డు.. మూడేళ్లు కనెక్టివిటీ ఉచితం.
-ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలం. చదరపు గజం రూ.4వేలు చొప్పున 230 ఎకరాల కేటాయింపు.

-జర్నలిస్టులకు కేటాయించిన 30 ఎకరాల స్థలానికి విడతలవారీగా సీఆర్డీఏకు సొమ్ము చెల్లింపు

– 22 ఆస్పత్రుల స్థాయిని పెంచడానికి ఆమోదం.

– రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు.

– గ్రామ పంచాయతీ కంటెంజెన్సీ ఉద్యోగుల జీతాలు పెంచుకోడానికి గ్రామ పంచాయతీలకు వెలుసుబాటు