mictv telugu

ఢిల్లీ దీక్షకు అయిన ఖర్చెంతో చెప్పిన చంద్రబాబు

February 13, 2019

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హొదే లక్ష్యంగా ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష జరిగింది. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు రెండువేలమంది ప్రజలు రెండు ప్రత్యేక రైళ్లలో వెళ్లారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు రూ.10 కోట్లకు పైగా ఖర్చు అయిందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబందించిన ప్రభుత్వ జీవో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.

Telugu News ap cm Chandrababu Naidu denies ten crore expenditure for Deeksha

మొత్తం రూ.2కోట్ల 83 లక్షలు మాత్రం ఖర్చు అయిందని తేల్చింది. రెండు ప్రత్యేక రైళ్లకు రూ.కోటీ 23 లక్షలు, ఏపీ భవన్‌లో రూ.కోటీ 60 లక్షలు ఖర్చయ్యాయని వివరించింది. మన రాష్ట్రం కోసమే దీక్ష చేశామని.. మోడీ అప్పట్లోనే తన సొంతానికి దీక్ష చేసి రూ.80 లక్షలు ఖర్చు చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.Telugu News ap cm Chandrababu Naidu denies ten crore expenditure for Deeksha