mictv telugu

చంద్రబాబు పండగ కానుక.. పింఛను రెట్టింపు

January 11, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి సందర్భంగా పండగలాంటి నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులకు ఇస్తున్న రూ. 1000 పింఛనును రెట్టింపు చేస్తున్నారు. ఆయన ఈ రోజు నెల్లూరు జిల్లా బోగోలు ప్రాంతంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దివ్యాంగులు, హిజ్రాలకు ఇస్తున్న రూ.1500 ఫించన్ కూడా రెట్టింపు చేశారు.

Telugu news AP CM Chandrababu naidu doubles pension amount to old, widows and transgenders on the festive season of Sankranthi .

పెంపు జనవరి నుంచే అమల్లోకి పెంచిన పింఛను చెల్లిమన్నారు. ఈ నెలలో వెయ్యి పింఛను తీసుకున్నవాళ్లకు మిగతా వెయ్యి వచ్చే నెల పింఛనుతో కలిపి ఇస్తామన్నారు. పెంపు నిర్ణయం వల్ల 54 లక్షల మందికి లబ్ది కలగనుంది. వృద్ధులతోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు కూడా ఇకపై 2 వేలు వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే నెలకు రూ.1000కి పెంచారు. 

Telugu news AP CM Chandrababu naidu doubles pension amount to old, widows and transgenders on the festive season of Sankranthi