mictv telugu

ఏపీలోను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్

February 14, 2019

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

Telugu News ap cm Chandrababu Naidu laid foundation stone for basavatarakam cancer hospital in Amravati.

కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్‌, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఫరూక్‌, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఏపీలోనూ సేవలందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడుతున్నారు.Telugu News ap cm Chandrababu Naidu laid foundation stone for basavatarakam cancer hospital in Amravati