mictv telugu

మోదీ వచ్చారు.. నన్ను తిట్టారు.. పారిపోయారు.. చంద్రబాబు

February 10, 2019

ప్రధాని మోదీ ఆంధ్రకు రావడం వెనుకు పెద్ద కుట్ర వుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనను తిట్టడానికే ఆయన ఢిల్లీ నుంచి పని గట్టుకుని మరీ ఇక్కడకు వచ్చారని అన్నారు. ఆయన నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని వచ్చారు. ఈ గాబరాలో  రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండానే తిట్టి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. విజయవాడలో లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, మోదీ ఏపీ పర్యటనపై తన స్పందన తెలిపారు.

Telugu news AP CM Chandrababu saidModi  is a big conspirator of coming to Andhra pradesh .

‘అలా వచ్చారు.. నన్ను తిట్టారు.. పారిపోయారు. వాళ్ల ప్రభుత్వం ఏపీకి ఏం చేశారో చెప్పకుండానే వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ తల్లిని చంపి బిడ్డను కాపాడిందని మోదీ చెప్పారు. తల్లిని కూడా దగా చేసిన వ్యక్తి మోదీ. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లా. రాష్ట్రానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కేసుల మాఫీ కోసమే జగన్‌ బీజేపీతో లాలూచీ పడ్డారు. బీజేపీ సభకు జనం రారని తెలిసి వైసీపీ జన సమీకరణ చేపట్టింది.

నేనేదో యూటర్న్‌ తీసుకున్నానని మోదీ అంటున్నారు. నాది యూటర్న్ కానేకాదు.. రైట్‌ టర్నే. మీదే యూటర్న్‌. 670 అవార్డులు ఇచ్చారు. మళ్లీ మీరే విమర్శిస్తున్నారు. నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అంటున్నారు. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వాణీ నమస్కారం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను ఊచకోత కోశారు. అప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా. అది మనసులో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు. ఎవ్వరెన్ని మాటలు అన్నా నా దృష్టి మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం వైపే వుంటుంది. అమరావతిని ఢిల్లీ కంటే గొప్ప నగరంగా నిర్మిస్తాం’ అని అన్నారు చంద్రబాబు. Telugu news AP CM Chandrababu saidModi  is a big conspirator of coming to Andhra pradesh