వాళ్లను వదలొద్దు.. పూజారి సూసైడ్ సెల్ఫీ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

వాళ్లను వదలొద్దు.. పూజారి సూసైడ్ సెల్ఫీ వీడియో

October 3, 2018

గుళ్ళోంచి వెళ్లగొట్టారని  ఓ పూజారి ఆత్మహత్య చేసుకున్నాడు. గుప్త నిధుల కోసం పూజలు చేసినట్టు తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేశారని మనస్తాపం చెందిన అర్చకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ  మండలంలో‌ని కణాపూర్‌లో జరిగింది. గ్రామంలోని శివాలయంలో శర్మ అనే వ్యక్తి 30 ఏళ్ళ నుంచి పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని కొందరు, శర్మ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడని  ఆరోపణలు చేశారు. తనపై నిందలు వేయడమేగాక తన కుటుంబంపైన కూడా ఆరోపణలు చేశారు. అంతేకాకుండా శర్మను పూజారి విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన శర్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

‘నా ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. వారి పేర్లను తెలుపుతున్నాను. నా  స్థానంలో వచ్చే మరో అర్చకుడికైనా ఇదే గతి పట్టొచ్చు. గుప్త నిధుల తవ్వకాలు జరిపామని నాపై, నా కుంటుంబ సభ్యులపై నిందలు మోపిన వారిని విడిచిపెట్టొద్దు’ అంటూ ఆవేదనగా తెలిపాడు.