ఎపి సర్కార్ కొత్త నిర్ణయం..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎపి సర్కార్ కొత్త నిర్ణయం..!

September 13, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వింత   నిర్ణయం తీసుకుంది. పాఠాశాలల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు మరో కొత్త పనిని అప్పగించింది. విద్యాభ్యాసం చేయించాల్సిన వారితో విరాళాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఉన్నత పాఠాశాలల్లో కొత్తగా ప్రారంభించుతున్న ‘అమ్మకు వందనం’అనే కార్యక్రమం కోసం విరాళాలు సేకరించాలని ఆయా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయలకు ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది.

ఈ కార్యక్రమం దసరా సెలవులకు ముందే నిర్వహించాలని కోరింది. ఎప్పటినుండి  సేకరించాలో .. త్వరలోనే తేదిని వెల్లడిస్తామని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కార్యక్రమానికి సుమారు రూ.2.5 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం తరుపున రూ. 1.25 కోట్లు అందజేస్తామని తెలిపారు. మిగతా మెుత్తాన్ని ప్రధానోపాద్యాయులు, టీచర్లు విరాళాలను ప్రజల నుంచి సేకరించాలని ప్రభుత్వం ఆదేశం జారీచేసింది. దీంతో  ప్రభుత్వంపై విమర్శనలు వెల్లువెత్తున్నాయి. ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని  ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెప్పడం సిగ్గు చేటని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. అయితే గతంలో  కూడా అమరావతి నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.10 తక్కువ కాకుండా విరాళాలు తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ తో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయించింది. దీనిపై ప్రజలు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో చంద్రబాబు  ప్రభుత్వం ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.