నారా ఆడవారి నగల తూకాలు ఇవీ… - MicTv.in - Telugu News
mictv telugu

నారా ఆడవారి నగల తూకాలు ఇవీ…

December 8, 2017

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తమ కుటుంబ ఆస్తుల వివరాలను శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబంలో ఎవరికి ఎంత ఆస్తి ఉన్నది ఎవరూ పెద్దగా  పట్టించుకోవడం లేదు. అన్నీ కాకిలెక్కలే అని విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా, లోకేశ్ తన తల్లి భువనేశ్వరి,భార్య బ్రాహ్మణికి ఉన్న బంగారు ఆభరాణాల లెక్కలు కూడా బయటపెట్టాడు.

నారా భువనేశ్వరి పేరిట రూ. కోటి  27లక్షల 16 వేల విలువైన  బంగారు ఆభరణాలు ఉన్నాయి. అందులో విలువైన రాళ్లు పొదిగిన  3,519 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నాయి. వెండి 32 కిలోల 7 గ్రాములు ఉంది.  వీటి విలువ రూ. 4లక్షల 57 వేలు. భువనేశ్వరి పేరిట దాదాపుగా 60 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

నారా బ్రహ్మణి 2.3 కేజీల  బంగారు ఆభరణాలు ఉన్నాయి.  310,06 క్యారట్ల వజ్రాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 15 లక్షల 95 వేలు. వెండి  ఆభరణాలు 12 లక్షల37వేల విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఇకా దేవాన్ష్ పేరు మీద రూ 2లక్షల 27 వేల విలువైన వెండి ఉయ్యాళ్లు ఉన్నాయి.