వైఎస్‌కు రాజకీయ, పాలనా అనుభవం లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్‌కు రాజకీయ, పాలనా అనుభవం లేదు..

November 27, 2017

ఆంధ్రప్రదేశ్  పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  మంత్రిగా తను పడుతున్న కష్టాలన్నింటికి వైఎస్సారే కారణమని అన్నారు. ‘ మంత్రి నేనేమీ చేయలేకపోతే తప్పు నాది కాదు. అంతా వైఎస్ దే. ఆయన సీఎంగా ఉన్నప్పుడు  పంచాయితీ శాఖకు నిధులు తక్కువ కేటాయించారు. అందుకే నాకు ఏ పని చేయడానికైనా నిధుల్లేకుండా పోాయాయి.  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ అనుభవం ,పాలనా అనుభవం ఏ మాత్రం లేదు..  అందుకే  ఈ పరిస్థితి ఎదరైంది..’ అని లోకేశ్ అన్నారు.

లోకేశ్ వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు.. ‘పప్పుకు ఏమీ తెలియదు.. నోటికొచ్చినట్లు వాగడం తప్ప’ అని విరుచుకుపడుతున్నారు. లోకేశ్ వయసు వైఎస్ రాజకీయ కెరీర్ అంత కూడా లేదని, లోకేశ్ పరువు మరింత పోకుండా ఉండాలంటే ఆయన మౌనంగా ఉండడమే మేలని సూచిస్తున్నారు.  వెన్నుపోటు పొడిచిన తండ్రికి పుట్టి కొడుకు ఇంతకంటే ఏం మాట్లాడతారని కూడా అంటున్నారు. అసలు… రాజకీయాలంటే ఏమిటో తెలియకుండా..  మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ అయిన లోకేశ్ ఉన్న అర్హత ఏంటని ప్రశ్నిస్తున్నారు.